Sunday, June 27, 2021

Current Affairs One Liners in Telugu : February 2021

 

ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు

Ø ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ? ఫిబ్రవరి 1

Ø ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 2

Ø 2021 ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? Wetlands and Biodiversity

Ø ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 4

Ø 2021 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? ‘I Am And I Will’

Ø ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 10

Ø 2021 ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? Nutritious Seeds for a Sustainable Future

Ø సైన్స్ లో అంతర్జాతీయ మహిళా మరియు బాలికల దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 11

Ø 2021 సైన్స్ లో అంతర్జాతీయ మహిళా మరియు బాలికల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? Women Scientists at the forefront of the fight against COVID-19

Ø ప్రపంచ యునాని దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 11

Ø ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 13

Ø 2021 ప్రపంచ రేడియో దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? ‘Radio and Diversity’

Ø జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 13

Ø ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 20

Ø ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? A Call for Social Justice in the Digital Economy

Ø అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 21

Ø అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ? Fostering multilingualism for inclusion in education and society

Ø సెంట్రల్ ఎక్సైజ్ డే ఎప్పడు ? ఫిబ్రవరి 24

Ø జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పడు ? ఫిబ్రవరి 28

 


అంతర్జాతీయ అంశాలు

Ø  నాసాలో యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులయిన భారతసంతతి మహిళ ఎవరు ? భవ్యా లాల్‌

Ø  ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు కృషి చేస్తున్న సంస్థ ఏది ? స్పేస్‌ఎక్స్

Ø  ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టనున్న మిషన్‌’కు ఎవరు న్యాయకత్వం వహించనున్నారు ? జేర్డ్ ఐసాక్‌మన్

Ø మయన్మార్ రాజధాని ఏది ? నేపిడా

Ø మయన్మార్ దేశంలో అధికార పార్టీ చైర్మన్ ఎవరు ? ఆంగ్ ​సాన్​ సూకీ

Ø ప్రజల్లో ఒంటరితనాన్ని పొగొట్టి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం ‘మినిస్ట్రీ ఆఫ్‌ లోన్లీనెస్‌’ పేరుతో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన దేశం ఏది ? జపాన్

Ø ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బీర్‌ ఫ్యాక్టరీని ఇటీవల ఏ దేశంలో గుర్తించారు ? ఈజిప్టు

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘అభా అంతర్జాతీయ విమానాశ్రయం’ ఏ దేశంలో ఉంది ? సౌదీఅరేబియా

Ø గ్రీన్‌కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసిన దేశం ఏది ? అమెరికా

Ø ఇటీవల కాంగో దేశంలో హత్యకు గురైన ‘లూకా అటాన్సియా’ ఏ దేశ రాయబారి ? ఇటలీ

Ø కిలిమంజారో పర్వతం యొక్క ఎత్తు ఎంత ? 5,685 మీటర్లు

 

 

జాతీయ అంశాలు

Ø ఉరుములు, పిడుగుల వల్ల కలిగే విపత్తుపై పరిశోధన కోసం దేశంలోనే తొలిసారిగా ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటుచేయనున్నారు ? బాలేశ్వర్‌(ఒడిశా)

Ø ఏరో ఇండియా ప్రదర్శన - 2021 ఏ నగరంలో జరిగింది ? బెంగళూరు

Ø అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయిన హైవేగా రికార్డు సృస్టించిన రహదారి ఏది ? వడోదరా-భరూచ్‌ రహదారి

Ø ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సంస్థ విడుదలచేసిన ప్రజాస్వామ్య సూచీ- 2020లో భారత్ ర్యాంక్ ఎంత ? 53

Ø భారత్‌-పాక్‌ యుద్ధంలో భారత సాయుధ దళాలు విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణోత్సవ ‘విజయజ్వాల’కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏ నగరంలో ఆతిథ్యం ఇవ్వనుండదీ ? తిరుపతి

Ø రూ.5కే బోజనం అందించే ‘మా’ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ? పశ్చిమ బెంగాల్

Ø హొయసళ రాజుల కాలం నాటిదిగా భావిస్తున్న 11వ శతాబ్దం నాటి జైన మందిరం ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడింది ? కర్ణాటక

Ø తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ, తెలుగు వారికి అల్పసంఖ్యాక హోదా కల్పిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది ? పశ్చిమ బెంగాల్

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘బైందూరు విశ్వనాథ్‌’ ఏ క్రీడతో సంభందం కలిగి ఉన్నారు ? కంబళ .

Ø ఇటీవల భారీ వరదకు గురైన ‘ధౌలీగంగ నది’ ఏ రాష్ట్రంలో ఉంది ? ఉత్తరాఖండ్

Ø నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఆర్‌పీఎఫ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోబ్రా దళంలో తొలిసారిగా ఎంత మంది మహిళా సిబ్బంది చేరారు ? 34

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘వెరావల్‌ తీరం’ ఏ రాష్ట్రంలో ఉంది ? గుజరాత్‌

Ø జనరల్‌ కె.ఎస్‌. తిమ్మయ్య మ్యూజియంను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎక్కడ ప్రారంభించారు ? మడికెరి (కర్ణాటక)

Ø ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం అయిన మొతేరాలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని ఏ పేరుతో మార్పు చేసారు ? ‘నరేంద్ర మోదీ స్టేడియం’

Ø భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన కొత్త మెసేజింగ్‌ యాప్‌ ఏది ? సాయి (SAI)

Ø ఈ క్రింది ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది ? పుదుచ్చేరి

Ø పుదుచ్చేరిలో ఎవరి నేతృత్వంలోని కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. ? నారాయణస్వామి

Ø ‘గ్రీన్స్‌ జులాజికల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ కింగ్‌డమ్‌’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శన శాల (జంతువుల సంఖ్య రీత్యా) ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జూమ్ నగర్ (గుజరాత్)

Ø ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు ? రిత్వికశ్రీ

Ø ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌ని భారతీయ రైల్వే ఏ నదిపై నిర్మిస్తుంది ? చీనాబ్‌ నది (జమ్మూ-కశ్మీర్)

Ø ఆహార పదార్థాలను కల్తీ చేసిన వారికి జీవితకాల శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు చేసిన రాష్ట్రం ఏది ? మధ్యప్రదేశ్‌

Ø జిల్లా గ్రామీణ అభివృద్ధి సమాఖ్య (డీఆర్‌డీఏ) కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాల ఖర్చులో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి ఎంత ? 75 శాతం: 25 శాతం

 

 

ఆంధ్రప్రదేశ్ అంశాలు

Ø ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కు’ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? విశాఖపట్నం

Ø పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది ? సులభ్‌ ఇంటర్నేషనల్‌

Ø స్కోచ్‌ ఈ ఏటి ముఖ్యమంత్రి’ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు ? వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Ø 2019-20 మూడో ముందస్తు అంచనాల ప్రకారం పండ్ల ఉత్పత్తిలో దేశంలో ప్రధమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ? ఆంధ్రప్రదేశ్

Ø పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు ఎవరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు జారీచేసింది. ? హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి

Ø అగ్రవర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఏ పథకం అమలు చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ?ఈబీసీ నేస్తం

Ø దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సభ్యుడిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇటీవల ఎవరిని నియమించారు. ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Ø పరమవీర, అశోకచక్ర అవార్డు గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత నుండి ఎంతకు పెంచింది ? రూ.10లక్షల నుంచి ఒక కోటి రూపాయలకు

Ø స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌’ కార్యక్రమం ఏ నగరంలో జరిగింది ? తిరుపతి

Ø ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది ? ఒంగోలు

Ø ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ? అన్నీ సరైనివే

A) 2019-20 మూడో ముందస్తు అంచనాల ప్రకారం పూల దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది

B) 2019-20 మూడో ముందస్తు అంచనాల ప్రకారం సూక్ష్మసేద్యంలో దేశంలోనే రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది

C) 2019-20లో పాల దిగుబడిలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది

 

 


తెలంగాణ అంశాలు

Ø 2019-20 ఖరీఫ్కాలంలో ధాన్యం సేకరణలో తొలి రెండు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి ? హరియానా , తెలంగాణ

Ø కంప్యూటర్సొసైటీ ఆఫ్ఇండియా(సీఎస్), స్పెషల్ఇంట్రెస్ట్గ్రూప్‌(ఎస్ఐసీ) ఆన్-గవర్నెన్స్అవార్డు-2020’కు ఎంపికైన మొబైల్ యాప్ ఏది ? టీ-పోల్యాప్

Ø బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ఉద్యాన పంటల ప్రదర్శనలో రాష్ట్ర ఉద్యానశాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది ? తెలంగాణ

Ø జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ) మేయర్గా ఎవరు ఎన్నికయ్యారు ? గద్వాల విజయలక్ష్మి

Ø వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచిన తెలంగాణ యువతి ఎవరు ? మానస వారణాసి

Ø ఇటీవల ‘ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) 2001-2015’ గుర్తింపు పొందిన రవీంద్ర భారతి కళావేదిక ఎప్పుడు ప్రారంభమైంది ?

Ø 2020 సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ‘‘బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’’గా స్కోచ్ అవార్డుకు ఎంపికైన మంత్రి ఎవరు ? కె.తారక రామారావు

Ø విద్యార్థి స్థాయిలోనే ఆవిష్కర్తలుగా తీర్దిదిద్దడం కోసం ‘నవం’ ఆవిష్కరణల కేంద్రం (ఫౌండేషన్‌)ను తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది ? కామారెడ్డి జిల్లా

Ø తెలంగాణరాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘాల సమాఖ్య(ఎఫ్‌యూటీఏటీఎస్‌) నూతన ఛైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు. ? ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి

Ø బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021కి ఆతిధ్యం ఇవ్వనున్న నగరం ఏది ? హైదరాబాద్

 


ఆర్థికాంశాలు

Ø డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ ఎవరు ? విరాట్‌ కోహ్లీ

Ø తేజస్‌ ఎంకే1ఏ-ఎల్‌సీఏ యుద్ధ విమానాలను కనుగోలుచేసేదుకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ సంస్థ తో రూ.48 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ? హెచ్‌ఏఎల్‌

Ø ఆన్‌లైన్‌ వేలంలో రూ.2.3 కోట్లు పలికిన ‘సిర్కా-2020 పెయింటింగ్‌’ను ఈ క్రింది ఏ ప్రముఖుడు చిత్రించారు ? సద్గురు జగ్గీవాసుదేవ్‌

Ø 2021-22 కేంద్ర బడ్జెట్‌’లో కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎంత మొత్తం కేటాయించారు ? రూ. 35వేల కోట్లు

Ø 2021-22 కేంద్ర బడ్జెట్‌’లో ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి ఎంత మొత్తం కేటాయించారు ? రూ.2,23,846 కోట్లు

Ø 2021-22 ఆర్ధిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంత ? రూ.1,75,000కోట్లు

Ø బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ఎంత శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్’లో ప్రకటించింది ? 74 %

Ø ‘మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ట్రాఫిక్‌ ఇండెక్స్‌-2021’ నివేదిక ప్రకారం బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో భారత్‌.. ప్రపంచంలోనే ఎన్నవ స్థానంలో ఉంది ? రెండవ స్థానం

Ø విశాఖపట్నం స్టీలు ప్లాంటు గురుంచి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

A)  కేంద్ర ప్రభుత్వానికి 100% వాటా ఉంది

B)  ఇది ఒక నవరత్న కంపెనీ

C)  1971లో శంకుస్థాపన జరిగింది

 

 సైన్స్&టెక్నాలజీ

Ø గ్రహాంతర యాత్ర చేపట్టిన తొలి అరబ్బు దేశం ఏది ? యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

Ø మూర్ఛ వ్యాధిని నియంత్రించే ‘ఫార్మాస్యూటికల్‌ కంపోజిషన్స్‌ కంప్రైజింగ్‌ బ్రివరాసెటమ్‌’ అనే కొత్త ఔషధ సమ్మేళనం రూపొందించిన వారు ఎవరు ? డాక్టర్‌ టి.ఈశ్వర గోపాల కృష్ణమూర్తి

Ø వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్ క్షిపణిని ఇటీవల భారత్ విజయవంతంగా ప్రయోగించింది , అయితే దీనిని ఏ భద్రతా దళం కోసం అభివృద్ధి చేసారు ? నౌకాదళం

Ø కృత్రిమ శరీర భాగంతో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి మహిళ మహిళ ఎవరు ? హేలీ ఆర్సెనోవ్‌

Ø ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేయకుండా, కేవలం జన్యువుల్లో మార్పు చేసి (జీఎంవో(జెనిటికల్లీ మోడిఫైడ్‌ ఆర్గానిజమ్స్‌) టమాటా వంగడాలను ఆవిష్కరించిన భారతీయ సంస్థ ఏది ? హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

Ø ‘పర్సెవరెన్స్‌’ వ్యోమ నౌక గురుంచి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

1) ‘మార్స్‌ 2020’ ప్రాజెక్టులో భాగంగా.. కారు పరిమాణంలో ఉండే ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ను నాసా 2020-జులైలో ప్రయోగించింది

2) అంగారకుడిపై జీవం ఉండేదా అన్నది తేల్చడం పర్సెవరెన్స్‌ ప్రధాన ఉద్దేశం.

౩) అంతరిక్షంలో ఏడు నెలల పాటు 30 కోట్ల మైళ్లు ప్రయాణించింది

 

 


క్రీడాంశాలు

Ø సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ-2020 విజేత జట్టు ఏది ? తమిళనాడు

Ø ఇటీవల క్రికెట్’కు వీడ్కోలు పలికిన ‘డుప్లెసిస్’ ఏ దేశానికి చెందినవాడు ? దక్షిణాఫ్రికా

Ø 2021 నుంచి 2023 వరకు ఐసీసీ ఈవెంట్లకు స్పాన్సర్గా వ్యవహరించనున్న సంస్థ ఏది ? బైజుస్

Ø బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) పదో సీజన్ విజేత జట్టు ఏది ? సిడ్నీ సిక్సర్స్‌

Ø జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ - 2021 ఎవరు గెలుచుకున్నారు ? సత్యన్‌

Ø ఆస్ట్రేలియన్‌ ఓపెన్ - 2021 మహిళల సింగిల్స్‌ విజేత ఎవరు ? ఒసాకా నవోమి

 

 

వార్తల్లో వ్యక్తులు

Ø ఇటీవల మృతిచెందిన ‘పెమ్మరాజు సూర్యారావు’ ఏ రంగానికి చెందినవాడు ? సంగీత విద్వాంసుడు

Ø కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు ? ప్రవీణ్‌ సిన్హా

Ø జాతీయ ఎస్సీ కమిషన్‌ నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ? విజయ్‌ సాంప్లా

Ø ఐరాస క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(యూఎన్‌సీడీఎఫ్‌)లో అత్యున్నత హోదా అయిన కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన భారత సంతతి వ్యక్తీ ఎవరు ? ప్రీతి సిన్హా

Ø ఇటీవల మృతిచెందిన ‘జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి’ , ఈ క్రింది ఏ కళలో సుప్రసిద్దుడు ? కలంకారీ కళ

Ø ఐక్యరాజ్య సమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌(ఎస్‌జీ) పదవికి పోటీ పడనున్నట్లు ప్రకటించిన భారత సంతతి మహిళ ఎవరు ? అరోరా ఆకాంక్ష

Ø రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ? మల్లికార్జున ఖర్గే

Ø మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌

Ø ఇటీవల మృతిచెందిన ‘డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి’ ఏ రంగానికి చెందినవారు ? రచయిత

Ø సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు ? మాతం వెంకటరావు

Ø పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ)గా ఎవరు నియమితులయ్యారు ? తమిళిసై సౌందరరాజన్‌

Ø ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం’ (యూఎన్‌డీపీ)లో అండర్‌ సెక్రటరీ జనరల్‌ మరియు సహాయ పరిపాలకురాలిగా నియమితులైన భారతీయురాలు ఎవరు? ఉషారావు మొనారీ

 

అవార్డులు

 

Ø అమెరికన్‌ సొసైటీ ఫర్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) సంస్థ ప్రదానం చేసే రుడాల్ఫ్‌ వి. షిండ్లర్‌ అవార్డును అందుకున్న వారు ఎవరు ? డాక్టర్‌ డి. నాగేశ్వరరెడ్డి

Ø బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు’ సందర్భంగా ఏటా ఇచ్చే జినోమ్‌ వ్యాలీ ప్రతిభా పురస్కారానికి (ఎక్స్‌లెన్స్‌ అవార్డు) 2021 సంవత్సరానికి గాను ఏ సంస్థ ఎంపికయ్యింది ? ‘భారత్‌ బయోటెక్‌’

Ø 2021 సంవత్సరానికి గాను సెరావీక్‌ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ పురస్కారాన్ని అందుకొన్న భారత ప్రముఖుడు ఎవరు ? నరేంద్ర మోడీ



పుస్తకాలు

 

Ø మేవరిక్మెస్సయ: పొలిటికల్బయోగ్రఫీ ఆఫ్ఎన్టీ రామారావుపుస్తక రచయిత ఎవరు ? రమేశ్ కందుల

For Free Daily Practice Tests Download Android APP : https://cutt.ly/3jzlRK2    

Free Current Affairs Visit Website :: https://dailygkintelugu.com/                                

Video Classes visit Youtube :: https://www.youtube.com/channel/UCzGwsQsEraYecj_-dRwrWmw

FaceBook :: https://www.facebook.com/dailygkintelugu

rrb ntpc memory based questions in telugu

rrb group d practice tests in telugu

rrb model papers in telugu

appsc group2 model papers

current affairs in telugu

current affairs free pdf

rrb ntpc papers pdf

current affairs in telugu

current affairs science and technlogy in telugu

#current affairs 2021 in telugu

appsc grup2 preparation in telugu

year book 2021 in telugu

current affairs for appsc exams in telugu

current affairs for tspsc exams in telugu

gk for rrb exams in telugu

science & technology 2021 in telugu

persons in news 2021 in telugu

current affairs bit bank 2021 in telugu

current affairs one liners in telugu

current affairs Febraury 2021 in telugu

#current affairs in telugu

#current affairs one liners

#dailygkintelugu


#current affairs in telugu

# current affairs e-book 2021

#current affairs monthly

#appsc currrent affairs

#tspsc current affairs

#ap police exam material

#si exam preparation

#govt jobs updates

2 comments:

Current Affairs One Liners in Telugu : February 2021

  ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు Ø ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ? ఫిబ్రవరి 1 Ø ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 2 Ø ...